![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో స్టార్టింగ్ అంతా ఫుల్ జోష్ తో సాగింది కానీ లాస్ట్ లో కన్నీళ్లు పెట్టించింది అందరితో. మిస్టర్ అండ్ మిసెస్ అనే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ప్రేమ వెనక పెయిన్ కూడా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఒక సెగ్మెంట్ నడిపారు. ఐతే ఇందులో ముందుగా తెలుగు నటుడు చింటూ అలియాస్ శ్రీనివాస్ దేవగుడి ఆయన వైఫ్ శాంతి వచ్చారు. "పదేళ్లు అవుతోంది నాకు ఒక బేబీ పుట్టింది.
నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చాల కాంప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని రూమర్స్ వచ్చాయి తన గురించి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిన నేను బయటకు వస్తానో రానో తెలీదు. ఒకవేళ నాకు ఎమన్నా ఐతే మాత్రం పాపను మాత్రం వదలద్దు అని చెప్పాను. బాధపడ్డాను.. ఆ మూమెంట్ లో కొంతమంది మాటలు కూడా నమ్మాను. " అంటూ ఏడ్చేసింది శాంతి . ఆమె మాటలకు చింటూ కూడా ఏడ్చేశాడు. ఇక తర్వాత కరం - డాలి జంట వచ్చారు. "పెళ్లి చాల బాగా జరిగింది.
అక్కడ వరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. ఆ నెపం అంతా నా మీద వేసేసారు. నీ వల్లే మీ అమ్మ చనిపోయింది అన్నప్పుడు నేను చాలా...నిజంగా నా వల్ల కాదు" అంటూ ఏడ్చేశారు ఇద్దరూ. ఇండస్ట్రీలోకి నువ్విలా అనే మూవీతో చింటూ ఎంట్రీ ఇచ్చారు తర్వాత అవును మూవీతో మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత రాజా ది గ్రేట్, వాల్తేర్ వీరయ్య, తీస్మార్ ఖాన్, భాగమతి వంటి ఎన్నో మూవీస్ లో నటించాడు. ఇక కరం ప్రేమ ఎంత మధురం, ఉమ్మడి కుటుంబం, అమ్మోరు, గువ్వా గోరింకా వంటి తెలుగు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.
![]() |